పట్టభద్రుల ఎమ్మెల్సీ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్*

జనగాం (తెలంగాణ గొంతుక) వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలైనట్లు *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. 2026 నవంబర్ 1ని అర్హత తేదీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.01-11-2026 నాటికి కనీసం 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు Form-18 దరఖాస్తును AEROలకు (లేదా) నియమిత అధికారికి సమర్పించాలన్నారు. నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులు స్వీకరిస్తారు.నవంబర్ 20 వరకు ముసాయిదా జాబితా తయారీ, ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి, నవంబర్ 25న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు,అభ్యంతరాలు స్వీకరిస్తారు....