Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కాకతీయ పాఠశాలలో వైద్య పరీక్షలు..

Author
Posted By satla anil kumar
| 30 Sep 2026, 02:32 PM | Array
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కాకతీయ పాఠశాలలో వైద్య పరీక్షలు..

వర్ధన్నపేట : విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కాకతీయ పాఠశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పల్లె దవాఖాన వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో పాఠశాలలోని విద్యార్థులకు పలు రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
పల్లె దవాఖాన వైద్యులు డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా బీపీతో పాటు విద్యార్థుల సాధారణ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే గుర్తించేలా పరీక్షలు చేపట్టారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన నీటిని తాగడం వంటి అలవాట్లను చిన్ననాటి నుంచే అలవరుచుకోవాలని తెలిపారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా సమతుల్యమైన, పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు.
అలాగే ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాలని విద్యార్థులకు వివరించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా అనేక సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల ఈ హెల్త్ క్యాంప్ ఉపయోగకరంగా నిలిచిందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ANM సరోజ, అపరంజి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోడిశాల శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కాకతీయ పాఠశాలలో వైద్య పరీక్షలు..  - Additional Imageవిద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కాకతీయ పాఠశాలలో వైద్య పరీక్షలు..  - Additional Imageవిద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కాకతీయ పాఠశాలలో వైద్య పరీక్షలు..  - Additional Image