విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కాకతీయ పాఠశాలలో వైద్య పరీక్షలు..
వర్ధన్నపేట : విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కాకతీయ పాఠశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పల్లె దవాఖాన వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో పాఠశాలలోని విద్యార్థులకు పలు రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. పల్లె దవాఖాన వైద్యులు డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా బీపీతో పాటు విద్యార్థుల సాధారణ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే గుర్తించేలా పరీక్షలు చేపట్టారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్య...