Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హైవేపై రెండు కార్లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు.. 108లో ఆస్పత్రికి తరలింపు

హైవేపై రెండు కార్లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు.. 108లో ఆస్పత్రికి తరలింపు

రాయపర్తి: వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై రాయపర్తి మండల కేంద్రం శివారులో బుధవారం వేకువజామున రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కూడలి దేవి ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తూ అదుపుతప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా 108 వాహనంలో సమీప దవాఖానకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.