హైవేపై రెండు కార్లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు.. 108లో ఆస్పత్రికి తరలింపు
రాయపర్తి: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రాయపర్తి మండల కేంద్రం శివారులో బుధవారం వేకువజామున రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కూడలి దేవి ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తూ అదుపుతప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా 108 వాహనంలో సమీప దవాఖానకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.