Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రైలు ఢీకొని 600 గొర్రెలు మృతి రూ.20 లక్షల వరకు నష్టం.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

Author
Posted By satla anil kumar
| 29 Sep 2026, 06:15 PM | TELANGANA
రైలు ఢీకొని 600 గొర్రెలు మృతి రూ.20 లక్షల వరకు నష్టం.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

బీబీనగర్‌, సెప్టెంబరు 29: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌–ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్ల మధ్య కొండమడుగు సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో కుక్కలు, అడవి పందులు బెదిరించడంతో భయపడిన సుమారు 600 గొర్రెలు రైల్వే ట్రాక్‌పైకి వచ్చాయి. అదే సమయంలో అటుగా వచ్చిన రైలు ఢీకొనడంతో గొర్రెలన్నీ అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో గొర్రెల యజమాని కిష్టయ్యకు సుమారు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.
జీవనాధారంగా పెంచుకుంటున్న గొర్రెలన్నీ ఒక్కసారిగా మృతి చెందడంతో కిష్టయ్య కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును స్థానికులు, బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిష్టయ్యను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అధికారులు వెంటనే స్పందించాలి
ఘటనపై జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ భాస్కర్‌రావుతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద వివరాలను తెలియజేసి వెంటనే పంచనామా నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. జీవనోపాధిని కోల్పోయిన బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

రైలు ఢీకొని 600 గొర్రెలు మృతి రూ.20 లక్షల వరకు నష్టం.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య - Additional Imageరైలు ఢీకొని 600 గొర్రెలు మృతి రూ.20 లక్షల వరకు నష్టం.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య - Additional Image