రైలు ఢీకొని 600 గొర్రెలు మృతి రూ.20 లక్షల వరకు నష్టం.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
జీవనాధారంగా పెంచుకుంటున్న గొర్రెలన్నీ ఒక్కసారిగా మృతి చెందడంతో కిష్టయ్య కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును స్థానికులు, బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిష్టయ్యను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అధికారులు వెంటనే స్పందించాలి
ఘటనపై జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్‌రావుతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద వివరాలను తెలియజేసి వెంటనే పంచనామా నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. జీవనోపాధిని కోల్పోయిన బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.