Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు

Author
Posted By Suresh Budige
| 29 Sep 2026, 05:22 PM | TELANGANA, జనగాం
అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు

జఫర్ ఘడ్, సెప్టెంబర్ 28 : జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలంలోని మంగళవారం తిమ్మంపేట గ్రామంలోని అంగన్వాడి టు కేంద్రంలో పోషణ మాసోత్సవాలు. సమతుల్య ఆహారం, చిన్నారుల ఎదుగుదలపై తల్లులకు అవగాహన కల్పించిన ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అనిత.చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తిమ్మంపేట 2 అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిమ్మంపేట సెక్టార్ ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోషకాహారం ప్రాధాన్యతను వివరించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్యమైన పోషకాహారం ఎంతోఅవసరమని కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది పేర్కొన్నారు. స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలనుపిల్లలకుఅందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకుబాటలువేయవచ్చని సూచించారు.తల్లులు కూడా పిల్లల ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పోషకాహారానికి సంబంధించిన అంశాలను తల్లులకు వివరించడంతో పాటు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్నసేవలనుసద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషకాహార మాసోత్సవాల ఉద్దేశాలనుప్రజల్లోకితీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతవిస్తృతంగానిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మంపేట సెక్టార్ అంగన్వాడి ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈకార్యక్రమం సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, తల్లులు చురుగ్గా పాల్గొని పోషకాహారంపై అవగాహన పెంచుకున్నారు.