అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు

జఫర్ ఘడ్, సెప్టెంబర్ 28 : జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలంలోని మంగళవారం తిమ్మంపేట గ్రామంలోని అంగన్వాడి టు కేంద్రంలో పోషణ మాసోత్సవాలు. సమతుల్య ఆహారం, చిన్నారుల ఎదుగుదలపై తల్లులకు అవగాహన కల్పించిన ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అనిత.చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తిమ్మంపేట 2 అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిమ్మంపేట సెక్టార్ ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోషకాహారం ప్రాధాన్యతను వివరించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్యమైన పోషకాహారం ఎంతోఅవసరమని కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది పేర్కొన్నారు. స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలనుపిల్లలకుఅందించడం ద్వారా ఆరోగ్యకరమైన...