Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బండౌతపురంలో ఘనంగా గ్రాండ్‌ పేరెంట్స్‌ డే* *

Author
Posted By satla anil kumar
| 29 Sep 2026, 02:17 PM |
బండౌతపురంలో ఘనంగా గ్రాండ్‌ పేరెంట్స్‌ డే*  *

వర్ధన్నపేట

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా వర్ధన్నపేట మండలం బండతపురం గ్రామంలో గ్రాండ్‌ పేరెంట్స్‌ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ చంద్రకళ, గ్రామ ఉపసర్పంచ్‌ అమరేందర్‌ హాజరయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని వయోవృద్ధులను ఆహ్వానించి చిన్నారులతో కలిసి వివిధ ఆటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ నేటి తరానికి వయోవృద్ధుల అనుభవాలు, విలువలు తెలియజేయడంతో పాటు తరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వయోవృద్ధులను గౌరవంగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించాలని సూచించారు. తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టంపై అవగాహన కల్పిస్తూ వయోవృద్ధులను నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని వివరించారు. వయోవృద్ధులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 14567కు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు. అనంతరం చిన్నారులు, వయోవృద్ధులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్తులు

బండౌతపురంలో ఘనంగా గ్రాండ్‌ పేరెంట్స్‌ డే*  * - Additional Image