బండౌతపురంలో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే* *
వర్ధన్నపేట అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా వర్ధన్నపేట మండలం బండతపురం గ్రామంలో గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ చంద్రకళ, గ్రామ ఉపసర్పంచ్ అమరేందర్ హాజరయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని వయోవృద్ధులను ఆహ్వానించి చిన్నారులతో కలిసి వివిధ ఆటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ నేటి తరానికి వయోవృద్ధుల అనుభవాలు, విలువలు తెలియజేయడంతో పాటు తరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వయోవృద్ధులను గౌరవంగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించాలని సూచించారు. తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టంపై అవగాహన కల్పిస్తూ వయోవృద్ధులను నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన...