Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యువకుడిని కొట్టిన ఢిల్లీ డిప్యూటీ సీఎంపై ఫిర్యాదు

యువకుడిని కొట్టిన ఢిల్లీ డిప్యూటీ సీఎంపై ఫిర్యాదు

న్యూఢిల్లీ: రోడ్డు పరిశీలన సందర్భంగా యువకుడిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం, పీడబ్ల్యూడీ మంత్రి పర్వేశ్‌ వర్మపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వికాస్‌పురి పోలీస్‌స్టేషన్‌లో సాహిబ్‌ సింగ్‌ ఫిర్యాదు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. రోడ్డుపై జరుగుతున్న పరిశీలనను సాహిబ్‌ సింగ్‌ తన ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా వర్మ అతడిని కొట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.
ఈ ఘటనపై ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. పీడబ్ల్యూడీ అధికారులు, కాంట్రాక్టర్‌ కూడా సాహిబ్‌ సింగ్‌పై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. కాగా, వర్మ తన కుటుంబ సభ్యులను దూషించడంతో ఆగ్రహంతో స్పందించానని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు వాస్తవాలను పరిశీలిస్తున్నారు.