యువకుడిని కొట్టిన ఢిల్లీ డిప్యూటీ సీఎంపై ఫిర్యాదు
ఈ ఘటనపై ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. పీడబ్ల్యూడీ అధికారులు, కాంట్రాక్టర్ కూడా సాహిబ్ సింగ్‌పై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. కాగా, వర్మ తన కుటుంబ సభ్యులను దూషించడంతో ఆగ్రహంతో స్పందించానని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు వాస్తవాలను పరిశీలిస్తున్నారు.