Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మిస్సింగ్ కేసు.. హత్యగా మారిన వైనం

Author
Posted By Telangana Gontuka
| 28 Sep 2026, 08:02 PM | TELANGANA
మిస్సింగ్ కేసు.. హత్యగా మారిన వైనం

మంచిర్యాల జిల్లా: మిస్సింగ్‌గా నమోదైన కేసు చివరకు హత్యగా మారిన ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం రేపుతోంది. చెన్నూరు మండలం సోమనపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో కుడుకల శ్రీనివాస్ మృతదేహం లభ్యమైనట్లు సమాచారం.

నీల్వాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఈ నెల 20న కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాల ఆధారంగా శ్రీనివాస్ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో మృతుడి సొంత అన్నతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హత్యకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఘటనాస్థలంలో వైద్య, పోలీసు అధికారులు కలిసి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించినట్లు సమాచారం. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.