మిస్సింగ్ కేసు.. హత్యగా మారిన వైనం

మంచిర్యాల జిల్లా: మిస్సింగ్‌గా నమోదైన కేసు చివరకు హత్యగా మారిన ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం రేపుతోంది. చెన్నూరు మండలం సోమనపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో కుడుకల శ్రీనివాస్ మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. నీల్వాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఈ నెల 20న కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాల ఆధారంగా శ్రీనివాస్ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మృతుడి సొంత అన్నతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హత్యకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న...