Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రూ.15 వేల లంచం తీసుకుంటూ ఆర్‌ఐ పట్టుబాటు

Author
Posted By Telangana Gontuka
| 28 Sep 2026, 07:59 PM | TELANGANA
రూ.15 వేల లంచం తీసుకుంటూ ఆర్‌ఐ పట్టుబాటు

నల్లగొండ: నాంపల్లి తహసీల్దార్‌ కమ్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) రల్లబండి గోపరాజు లంచం వ్యవహారంలో ఏసీబీకి చిక్కారు. వ్యవసాయ భూమికి సంబంధించిన పంచనామా నివేదికను తహసీల్దార్‌కు సమర్పించేందుకు రూ.15 వేలు డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ మొత్తాన్ని ప్రైవేట్‌ వ్యక్తి అడ్డుల్ల యాదగిరి ద్వారా తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం వల పన్నిన ఏసీబీ అధికారులు యాదగిరి నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.