నల్లగొండ: నాంపల్లి తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) రల్లబండి గోపరాజు లంచం వ్యవహారంలో ఏసీబీకి చిక్కారు. వ్యవసాయ భూమికి సంబంధించిన పంచనామా నివేదికను తహసీల్దార్‌కు సమర్పించేందుకు రూ.15 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తి అడ్డుల్ల యాదగిరి ద్వారా తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం వల పన్నిన ఏసీబీ అధికారులు యాదగిరి నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.