Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 07:43 PM | TELANGANA
మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మోహన్‌ సింగ్‌ దేశం గర్వించదగ్గ జాతిరత్నమని, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ దేశానికి సేవలందించారని పేర్కొన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కీలక సంస్కరణలు చేపట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మన్మోహన్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ, ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. ఢిల్లీలో మన్మోహన్‌ సింగ్‌ పేరుతో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.