మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి సేవలందించారని పేర్కొన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కీలక సంస్కరణలు చేపట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ, ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ పేరుతో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.