Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దసరాకు ముందే రైతుల ఖాతాల్లో జమ?

దసరాకు ముందే రైతుల ఖాతాల్లో జమ?

న్యూఢిల్లీ: అక్టోబర్‌ 20న దసరా పండుగ నేపథ్యంలో.. అక్టోబర్‌ 17న పీఎం కిసాన్‌ నిధులు విడుదల కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏపీలో పీఎం కిసాన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ కానున్నట్లు సమాచారం. అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు, పీఎం కిసాన్‌ కింద రూ.2 వేలు కలిపి రూ.6 వేలు అందనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్‌ ప్రయోజనం పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. భూమి వివరాల మ్యాపింగ్‌, బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ అనుసంధానం, ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌ పూర్తై ఉండాలి. పీఎం కిసాన్‌ ద్వారా ఏడాదికి రూ.6 వేలు మూడు విడతల్లో అందిస్తారు. 2026 జూన్‌ 20న 23వ విడత విడుదలైంది. లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో ఇలా చూడండి..
PM-KISAN అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘Beneficiary List’ను ఎంచుకోవాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ వివరాలు నమోదు చేసి జాబితాలో పేరు ఉందో పరిశీలించుకోవచ్చు. ‘Know Your Status’ ద్వారా చెల్లింపు వివరాలను కూడా తెలుసుకోవచ్చు.