దసరాకు ముందే రైతుల ఖాతాల్లో జమ?

న్యూఢిల్లీ: అక్టోబర్‌ 20న దసరా పండుగ నేపథ్యంలో.. అక్టోబర్‌ 17న పీఎం కిసాన్‌ నిధులు విడుదల కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏపీలో పీఎం కిసాన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ కానున్నట్లు సమాచారం. అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు, పీఎం కిసాన్‌ కింద రూ.2 వేలు కలిపి రూ.6 వేలు అందనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్‌ ప్రయోజనం పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. భూమి వివరాల మ్యాపింగ్‌, బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ అనుసంధానం, ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌ పూర్తై ఉండాలి. పీఎం కిసాన్‌ ద్వారా ఏడాదికి రూ.6 వేలు మూడు...