Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చిక్కడపల్లిలో మహిళ దారుణ హత్య

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 07:37 PM | TELANGANA
చిక్కడపల్లిలో మహిళ దారుణ హత్య

హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో ఆదివారం దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నరేందర్‌ (34) తన భార్య తేజస్వి (29)పై రోకలిబండతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన తేజస్వి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటన అనంతరం నరేందర్‌ పరారైనట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.