Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పోలీసులు తనను కొట్టారని కాంగ్రెస్ నేత ఆరోపణ

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 07:24 PM | TELANGANA
పోలీసులు తనను కొట్టారని కాంగ్రెస్ నేత ఆరోపణ

వికారాబాద్: పరిగిలో వినాయక నిమజ్జనం సందర్భంగా పీఏసీఎస్‌ చైర్మన్‌ పార్థసారథి, టౌన్‌ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బుర్కని బాలకృష్ణ మధ్య వాగ్వాదం జరిగినట్లు బాలకృష్ణ తెలిపారు. అనంతరం పార్థసారథికి క్షమాపణలు చెప్పినప్పటికీ పోలీసులు తనను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి బట్టలు విప్పించి విచక్షణారహితంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారని ఆయన ఆరోపించారు.
తనపై పోలీసులు ఎందుకు దాడి చేశారో, ఎవరి మద్దతుతో అలా వ్యవహరించారో తెలియాలని బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. 26 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తున్న తనకు ఇదేనా గౌరవం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు.