Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించిన రాజ్ గోపాల్ రెడ్డి

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 07:17 PM | TELANGANA
ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించిన రాజ్ గోపాల్ రెడ్డి

నారాయణపూర్: మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 17వ విడత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ప్రారంభించారు. సుశీలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుంటున్న వృద్ధులు, మహిళలను ఆత్మీయంగా పలకరించారు.
ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, ఆపరేషన్లకు ఎంపికైన వారికి భరోసా కల్పించారు. శిబిరంలో 976 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 183 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. వారిలో 111 మందిని హైదరాబాద్‌లోని శంకరా కంటి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు 16 శిబిరాల్లో 12,306 మందికి కంటి పరీక్షలు, 2,673 మందికి ఆపరేషన్లు, 5,522 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫీనిక్స్ ఫౌండేషన్, శంకరా కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారు.