ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించిన రాజ్ గోపాల్ రెడ్డి
ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, ఆపరేషన్లకు ఎంపికైన వారికి భరోసా కల్పించారు. శిబిరంలో 976 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 183 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. వారిలో 111 మందిని హైదరాబాద్‌లోని శంకరా కంటి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు 16 శిబిరాల్లో 12,306 మందికి కంటి పరీక్షలు, 2,673 మందికి ఆపరేషన్లు, 5,522 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫీనిక్స్ ఫౌండేషన్, శంకరా కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారు.