Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అడవితల్లి ఒడిలో ఆధ్యాత్మిక సందడి.. మేడారం జాతర వైభవం!

అడవితల్లి ఒడిలో ఆధ్యాత్మిక సందడి.. మేడారం జాతర వైభవం!

ములుగు: అడవితల్లి ఒడిలో జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతర తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. సమ్మక్క, సారలమ్మలను తమ సమాజం కోసం పోరాడిన వీరనారులుగా గిరిజనులు కొలుస్తారు. వారి జ్ఞాపకార్థం జరిగే జాతర కాలక్రమంలో భారీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా రూపుదిద్దుకుంది.
జాతర ప్రత్యేకతల్లో ‘బంగారం’ సమర్పణ ఒకటి. భక్తులు బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవార్లకు సమర్పిస్తారు. అడవులు, గుట్టలు, గిరిజన జీవన విధానం మధ్య జరిగే ఈ జాతరలో తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. తెలంగాణ టూరిజం దీనిని ప్రపంచ ప్రఖ్యాత గిరిజన ఉత్సవంగా పేర్కొంటోంది.
మేడారం కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు.. గిరిజన సంస్కృతి, ప్రకృతి పర్యాటకం, ఆధ్యాత్మికత కలిసిన ప్రత్యేక పర్యాటక గమ్యస్థానం. జాతర సమయంలో లక్షలాది మంది రాకతో ములుగు ప్రాంతం జనసంద్రంగా మారుతుంది. జాతర అనంతరం కూడా మేడారం–తాడ్వాయి–లక్నవరం–బొగత ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని గిరిజన పర్యాటక సర్క్యూట్‌లో భాగంగా అభివృద్ధి చేస్తోంది.
అడవితల్లి ఆశీస్సులు.. గిరిజనుల ఆచార సంప్రదాయాలు.. కోట్లాది భక్తుల విశ్వాసం.. ఇవన్నీ కలిసిన మేడారం జాతర ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి ప్రత్యేక పర్యాటక గుర్తింపును తెచ్చిపెడుతోంది.