అడవితల్లి ఒడిలో ఆధ్యాత్మిక సందడి.. మేడారం జాతర వైభవం!

ములుగు: అడవితల్లి ఒడిలో జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతర తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. సమ్మక్క, సారలమ్మలను తమ సమాజం కోసం పోరాడిన వీరనారులుగా గిరిజనులు కొలుస్తారు. వారి జ్ఞాపకార్థం జరిగే జాతర కాలక్రమంలో భారీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా రూపుదిద్దుకుంది. జాతర ప్రత్యేకతల్లో ‘బంగారం’ సమర్పణ ఒకటి. భక్తులు బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవార్లకు సమర్పిస్తారు. అడవులు, గుట్టలు, గిరిజన జీవన విధానం మధ్య జరిగే ఈ జాతరలో తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. తెలంగాణ టూరిజం దీనిని ప్రపంచ ప్రఖ్యాత గిరిజన ఉత్సవంగా...