Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

SIRపై ఈసీ కీలక నిర్ణయం!

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 09:55 PM | ANDHRA PRADESH, INTERNATIONAL, NATIONAL, TELANGANA
SIRపై ఈసీ కీలక నిర్ణయం!

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ అధ్యక్షతన శనివారం జరిగిన పూర్తి కమిషన్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పాల్గొన్నారు. SIRలో భాగంగా ‘అన్‌మ్యాప్డ్‌’ లేదా ‘లాజికల్‌ డిస్క్రెపెన్సీ’ కారణంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఇక సాధారణంగా ERO, AERO కార్యాలయాలకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదు. బూత్‌ లెవల్‌ అధికారులు (BLOలు) సంబంధిత ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలను స్వీకరించనున్నారు. అనంతరం ఆ పత్రాలను ECINETలో అప్‌లోడ్‌ చేసి, తుది నిర్ణయం కోసం EROకు పంపనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ERO విచారణ నిర్వహించనుంది. సాధ్యమైనంత వరకు విచారణను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఈసీ సూచించింది. అవసరమైతే ఓటరు అనుమతితో కుటుంబంలోని వయోజన సభ్యుడు కూడా విచారణకు హాజరుకావచ్చు. అలాగే ప్రత్యేక సహాయం అవసరమైన వర్గాల కోసం హెల్ప్‌డెస్క్‌లు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. కాగా, SIRకు సంబంధించిన శనివారం తీసుకున్న నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.