SIRపై ఈసీ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన పూర్తి కమిషన్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు. SIRలో భాగంగా ‘అన్‌మ్యాప్డ్’ లేదా ‘లాజికల్ డిస్క్రెపెన్సీ’ కారణంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఇక సాధారణంగా ERO, AERO కార్యాలయాలకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదు. బూత్ లెవల్ అధికారులు (BLOలు) సంబంధిత ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలను స్వీకరించనున్నారు. అనంతరం ఆ పత్రాలను ECINETలో అప్‌లోడ్ చేసి, తుది నిర్ణయం కోసం EROకు పంపనున్నారు. అత్యవసర...