Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆదివారం బ్యాంకులు ఓపెన్‌..!

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 09:50 PM | ANDHRA PRADESH, INTERNATIONAL, NATIONAL, TELANGANA
ఆదివారం బ్యాంకులు ఓపెన్‌..!

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా సెప్టెంబర్‌ 27, ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఆ రోజు బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం-లింక్‌డ్‌ శాఖలు, కరెన్సీ చెస్టులు పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్‌ 26 నాలుగో శనివారం, 27 ఆదివారం కావడంతో.. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల సమ్మె జరగనుంది. దీంతో బ్యాంకింగ్‌ సేవలకు వరుసగా ఐదు రోజుల అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులు అత్యవసర బ్యాంకింగ్‌ పనులను ఆదివారమే పూర్తి చేసుకోవచ్చు.
కాగా, యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలోని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఐదు రోజుల బ్యాంకింగ్‌ వారాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో సెప్టెంబర్‌ 28–30 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెను విరమించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్రం, బ్యాంకు యాజమాన్యాలు ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశాయి.