ఆదివారం బ్యాంకులు ఓపెన్..!
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా సెప్టెంబర్ 27, ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఆ రోజు బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం-లింక్‌డ్ శాఖలు, కరెన్సీ చెస్టులు పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 26 నాలుగో శనివారం, 27 ఆదివారం కావడంతో.. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల సమ్మె జరగనుంది. దీంతో బ్యాంకింగ్ సేవలకు వరుసగా ఐదు రోజుల అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున కేంద్రం ఈ...