Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పరకాల 100 పడకల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 04:18 PM | TELANGANA
పరకాల 100 పడకల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం

హన్మకొండ:పరకాల: పట్టణంలోని నూతన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓపీ వైద్య సేవలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి శనివారం ప్రారంభించారు. ఆసుపత్రిలో గణపతి పూజ అనంతరం ఫార్మసీ, జనరల్‌ వార్డు, గైనకాలజీ, ఏఎన్‌సీ, ల్యాబొరేటరీ తదితర విభాగాలను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి సేవలు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. 12 విభాగాల్లో సుమారు 27 మంది వైద్యులతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలు కల్పించి, ప్రైవేట్‌ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పరకాల ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ఏ+ కేటగిరీకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.