పరకాల 100 పడకల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. 12 విభాగాల్లో సుమారు 27 మంది వైద్యులతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలు కల్పించి, ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పరకాల ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ఏ+ కేటగిరీకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.