Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 03:20 PM | Politics, TELANGANA
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట: నియోజకవర్గంలోని 2వ డివిజన్ గుండ్లసింగారంలో మాదాసి దయాకర్‌–సుజాత దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.