వర్ధన్నపేట: నియోజకవర్గంలోని 2వ డివిజన్ గుండ్లసింగారంలో మాదాసి దయాకర్–సుజాత దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.