Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చర్చలు విఫలం.. సెప్టెంబర్‌ 28 నుంచి బ్యాంకు సమ్మె!

చర్చలు విఫలం.. సెప్టెంబర్‌ 28 నుంచి బ్యాంకు సమ్మె!

న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (UFBU) సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రధానంగా వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని బ్యాంకు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ అంశంపై సెప్టెంబర్‌ 22న జరిగిన చర్చల్లో స్పష్టమైన పురోగతి లేకపోవడంతో సమ్మెను కొనసాగించాలని యూనియన్లు నిర్ణయించాయి. సెప్టెంబర్‌ 26 నాలుగో శనివారం, 27 ఆదివారం కావడంతో సమ్మెకు ముందు రెండు రోజులు సాధారణ సెలవులు ఉన్నాయి. దీంతో శాఖల సేవలకు వరుసగా ఐదు రోజుల అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే వినియోగదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు సెప్టెంబర్‌ 27 ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమ్మె సమయంలో నగదు ఉపసంహరణ, డిపాజిట్లు, చెక్‌ క్లియరెన్స్‌, సిబ్బంది సహాయం అవసరమైన బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం లేదా ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది. ఏటీఎంలు, యూపీఐ, మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటి డిజిటల్‌ సేవలు సాధారణంగా అందుబాటులో ఉండే అవకాశం ఉందని బ్యాంకులు సూచించాయి. అత్యవసర లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని ఖాతాదారులకు సూచిస్తున్నారు.