చర్చలు విఫలం.. సెప్టెంబర్‌ 28 నుంచి బ్యాంకు సమ్మె!

న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (UFBU) సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రధానంగా వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని బ్యాంకు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ అంశంపై సెప్టెంబర్‌ 22న జరిగిన చర్చల్లో స్పష్టమైన పురోగతి లేకపోవడంతో సమ్మెను కొనసాగించాలని యూనియన్లు నిర్ణయించాయి. సెప్టెంబర్‌ 26 నాలుగో శనివారం, 27 ఆదివారం కావడంతో సమ్మెకు ముందు రెండు రోజులు సాధారణ సెలవులు ఉన్నాయి. దీంతో శాఖల సేవలకు వరుసగా ఐదు రోజుల అంతరాయం ఏర్పడే...