Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వంద మంది లబ్ధిదారులకు ఎగ్‌ కార్ట్స్‌ పంపిణీ

Author
Posted By Telangana Gontuka
| 24 Sep 2026, 07:41 PM | Array
వంద మంది లబ్ధిదారులకు ఎగ్‌ కార్ట్స్‌ పంపిణీ

వర్ధన్నపేట: నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (NECC) ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన సుమారు 100 మంది లబ్ధిదారులకు ఎగ్‌ కార్ట్స్‌ను పంపిణీ చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి కోళ్ల ఫామ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడిగుడ్డులో నాణ్యమైన ప్రోటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు లభిస్తాయని తెలిపారు. పిల్లల ఎదుగుదల, కండరాల అభివృద్ధి, శక్తికి కోడిగుడ్డు ఉపయోగకరమన్నారు. అందుబాటులో ఉండే ధరలో అధిక పోషక విలువలు అందించే ఆహారంగా కోడిగుడ్డును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి వినీత్‌రావు, వరంగల్‌ జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు, అరూరి గట్టుమల్ల మెమోరియల్‌ ఫౌండేషన్‌ (AGF) కార్యదర్శి అరూరి విశాల్‌, NECC జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఎజిల్‌కుమార్‌, రాజీవ్‌, కోళ్ల రైతులు సుబ్రహ్మణ్యం, దిలీప్‌రావు, స్థానిక నాయకులు, పౌల్ట్రీ రైతులు, లబ్ధిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.