వంద మంది లబ్ధిదారులకు ఎగ్ కార్ట్స్ పంపిణీ
వర్ధన్నపేట: నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన సుమారు 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్ట్స్‌ను పంపిణీ చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి కోళ్ల ఫామ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడిగుడ్డులో నాణ్యమైన ప్రోటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు లభిస్తాయని తెలిపారు. పిల్లల ఎదుగుదల, కండరాల అభివృద్ధి, శక్తికి కోడిగుడ్డు ఉపయోగకరమన్నారు. అందుబాటులో ఉండే ధరలో అధిక పోషక విలువలు అందించే ఆహారంగా కోడిగుడ్డును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో...