Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కాంగ్రెస్‌ పాలనలో కరెంటు కష్టాలు: ఆరూరి రమేష్‌

కాంగ్రెస్‌ పాలనలో కరెంటు కష్టాలు: ఆరూరి రమేష్‌

భూపాలపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితి గాడితప్పిందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపు మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అంటేనే కరెంటు కష్టాలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అన్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్‌ హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించామని, ప్రస్తుతం విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసినట్లు తాము ఆరోపిస్తున్న బొగ్గు వ్యవహారం కారణంగానే రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు తలెత్తాయని రమేష్‌ ఆరోపించారు. జెన్‌కోకు నాసిరకం బొగ్గు సరఫరా చేయడం వల్ల రాష్ట్రానికి రూ.2,900 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. రైతులకు కనీసం 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ పరిస్థితిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆరూరి రమేష్‌ కోరారు.