కాంగ్రెస్‌ పాలనలో కరెంటు కష్టాలు: ఆరూరి రమేష్‌

భూపాలపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితి గాడితప్పిందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపు మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అంటేనే కరెంటు కష్టాలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అన్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్‌ హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించామని, ప్రస్తుతం విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం...