Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

డీఎస్పీ భీమిరెడ్డి కేసులో ఏసీబీ దూకుడు

డీఎస్పీ భీమిరెడ్డి కేసులో ఏసీబీ దూకుడు

హైదరాబాద్‌: డీఎస్పీ భీమిరెడ్డికి సంబంధించిన ఏసీబీ కేసులో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఆయనకు సంబంధించినవారిగా అనుమానిస్తున్న ఎనిమిది మంది బినామీలను గుర్తించినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. వారి ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌ పుప్పాలగూడలో డీఎస్పీ గంగసాని శ్రీధర్‌ నేతృత్వంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ఇళ్లలో ఆస్తులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాల కోసం పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర వివరాలపై ఏసీబీ అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది.