డీఎస్పీ భీమిరెడ్డి కేసులో ఏసీబీ దూకుడు
హైదరాబాద్ పుప్పాలగూడలో డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ఇళ్లలో ఆస్తులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాల కోసం పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర వివరాలపై ఏసీబీ అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది.