Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎమ్మెల్యే నాగరాజు నమ్మకాన్ని వమ్ము చేయను...చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి

ఎమ్మెల్యే నాగరాజు నమ్మకాన్ని వమ్ము చేయను...చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి

వరంగల్: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి అన్నారు. గురువారం వర్ధన్నపేట పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ రాజిరెడ్డితో పాటు డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈఓ వెంకన్న వారికి స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు చైర్మన్, డైరెక్టర్లను ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడుతూ...
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పీఏసీఎస్ ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని, సహకార సంఘాల సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.