ఎమ్మెల్యే నాగరాజు నమ్మకాన్ని వమ్ము చేయను...చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పీఏసీఎస్ ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని, సహకార సంఘాల సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.