Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎస్సైకు రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు

Author
Posted By Telangana Gontuka
| 24 Sep 2026, 10:26 AM | TELANGANA
ఎస్సైకు రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా: తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వినాయక నిమజ్జన బందోబస్తు అనంతరం పిండిప్రోలు నుంచి పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం తెల్లవారుజామున భవాని హోటల్‌ సమీపంలో పోలీస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై జగదీష్‌తో పాటు డ్రైవర్‌ కొత్తపల్లి రాకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత తిరుమలాయపాలెం ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు