ఖమ్మం జిల్లా: తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వినాయక నిమజ్జన బందోబస్తు అనంతరం పిండిప్రోలు నుంచి పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం తెల్లవారుజామున భవాని హోటల్ సమీపంలో పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై జగదీష్‌తో పాటు డ్రైవర్ కొత్తపల్లి రాకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత తిరుమలాయపాలెం ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు