Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మాజీ ఎమ్మెల్యే, అధికారుల పేర్లతో కొందరు ఆయుష్ వైద్యుల హల్‌చల్?*

Author
Posted By Telangana Gontuka
| 24 Sep 2026, 09:07 AM | TELANGANA
మాజీ ఎమ్మెల్యే, అధికారుల పేర్లతో కొందరు ఆయుష్ వైద్యుల హల్‌చల్?*

వరంగల్ జిల్లా: వర్ధన్నపేట, రాయపర్తి ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న కొందరు బీఐఎంఎస్‌ ఆయుష్ వైద్యుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నెలకు సుమారు రూ.50 వేల వరకు ప్రభుత్వ వేతనం పొందుతున్న కొందరు వైద్యులు, మరోవైపు ప్రైవేట్ క్లినిక్‌లలోనూ సేవలందిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వైద్య సేవలు సకాలంలో అందుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె దవాఖానాలు, ఆరోగ్య ఉపకేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యులను నియమించింది. అయితే కొందరు సమయపాలన పాటించడం లేదని, విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాక తమకు మాజీ ఎమ్మెల్యే స్థాయి రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉందని, జిల్లా స్థాయి ఆరోగ్యశాఖ అధికారులతో పరిచయాలు ఉన్నాయని కొందరు వైద్యులు చెప్పుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర అధికారులు కూడా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడం లేదని వారు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

*అయితే ప్రభుత్వ జీతాలు పొందుతూ విధులు నిర్వహించే వైద్యులకు రాజకీయ లేదా అధికారుల బ్యాక్‌గ్రౌండ్ ఉంటే నిబంధనలు వర్తించవా? ప్రజల ఆరోగ్య సేవల కంటే పలుకుబడే ముఖ్యమా? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.*