మాజీ ఎమ్మెల్యే, అధికారుల పేర్లతో కొందరు ఆయుష్ వైద్యుల హల్చల్?*
వరంగల్ జిల్లా: వర్ధన్నపేట, రాయపర్తి ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న కొందరు బీఐఎంఎస్ ఆయుష్ వైద్యుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలకు సుమారు రూ.50 వేల వరకు ప్రభుత్వ వేతనం పొందుతున్న కొందరు వైద్యులు, మరోవైపు ప్రైవేట్ క్లినిక్లలోనూ సేవలందిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వైద్య సేవలు సకాలంలో అందుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె దవాఖానాలు, ఆరోగ్య ఉపకేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యులను నియమించింది. అయితే కొందరు సమయపాలన పాటించడం లేదని, విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక తమకు మాజీ ఎమ్మెల్యే స్థాయి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉందని, జిల్లా...