Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎంజీఎం ఘటనపై నన్నపునేని నరేందర్‌ ఆగ్రహం

Author
Posted By Telangana Gontuka
| 23 Sep 2026, 05:40 PM | TELANGANA
ఎంజీఎం ఘటనపై నన్నపునేని నరేందర్‌ ఆగ్రహం

వరంగల్‌: ఎంజీఎం ఆస్పత్రి సందర్శన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడం, అనంతరం జరిగిన తోపులాటపై తూర్పు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు నన్నపునేని నరేందర్‌ స్పందించారు. తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసుల వ్యవహారశైలిని ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధిని అడ్డుకోవడం సరికాదన్నారు.
ఎంజీఎం ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరత, ఓపీ చీటీలు, ఎక్స్‌రే యంత్రాలు, ల్యాబ్‌ల నిర్వహణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలపై కూడా సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.